హైదరాబాద్, జనవరి 25 (నమస్తేతెలంగాణ): గోదావరి మిగు లు జలాలను తరలించేందుకే బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. తెలంగాణ కాళేశ్వరం ప్రా జెక్టు కడితే తాము అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు బనకచర్లను నిర్మిస్తే అడ్డుకొనేందుకు యత్నించడం దురదృష్టకరమని వాపోయారు. శనివారం ఏపీలో విలేకరులతో మాట్లాడారు. ‘హైదరాబా ద్ అభివృద్ధిలో సగం విజయవాడ వాళ్ల దే.. అమెరికా అభివృద్ధిలోనూ సగం వా ళ్లదే’ అని వ్యాఖ్యానించారు. తాను 199 7 నుంచి దావోస్‌కు వెళ్తున్నానని చెప్పా రు. అప్పట్లో హైదరాబాద్ అంటే గుర్తు పట్టేవారు కాదని, పాకిస్తాన్లో ఉండే హైదరాబాద్ గురించా..? అని ప్రశ్నించేవారని తెలిపారు. తాను వెళ్లిన తర్వాతే అందరికీ హైదరాబాద్ గురించి తెలిసిందని పేర్కొన్నారు. తన హయాంలోనే హైదారాబాద్‌కు బ్రాండ్ క్రియేట్ చేశామని స్పష్టంచేశారు. దావోస్‌లో ఏపీకి ఆశించిన మేర పెట్టుబడులు రాకపోవడంపై స్పందిస్తూ.. ‘ఎంవోయూలు చేసుకున్నంత మాత్రాన పెట్టుబడులు తెచ్చినట్టు కాదు. తర్వాత ఎంవోయూలు అడిగేవారు కూడా ఎవరూ ఉండరు. కాగితాల మీద పెట్టి రిలీజ్ చేయ డం కరెక్ట్ కాదు’ అంటూ స్పష్టంచేశారు.
అవే గొప్పలు.. గప్పాలు
రాష్ట్రం విడిపోయి పదేండ్లు దాటింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎవరికీ వారు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం శక్తిమేర అభివృద్ధి పథంలో సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో మళ్లీ చంద్రబాబు హైదరాబాద్‌ను ఉద్ధరించింది తానేనంటూ.. తాను ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్‌ను ఎవరూ గుర్తించలేదని గొప్పలు చెప్పడాన్ని తెలంగాణవాసులు జీర్ణించుకోవడంలేదు. హైదరాబాద్ నగరానికి వందల ఏండ్ల క్రితమే దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయాన్ని ఉదహరిస్తూ బాబు వ్యాఖ్యలపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. దేశానికి రెండో రాజధానిగా గుర్తింపు పొందిందని, చంద్రబాబు రాక ముందే ఇక్కడి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధికి అడుగులు పడ్డ విషయాన్ని గుర్తుచేస్తున్నారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి అంకురార్పణ చేసిన హైటెక్‌సిటీని నిర్మించింది తానేనని చెప్పుకోవడం బాబుకే చెల్లిందని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికైనా గొప్పలు చెప్పడం మాని వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సెటైర్లు వేశారు.