Miss World Pagent | గద్వాల, మే 10 : రాష్ట్రంలో నిర్వహించే అందాల పోటీలను వెంటనే రద్దు చేయాలని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి డిమాండ్ చేశారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కార్యాలయం ఎదుట మహిళలు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవాన్ని భంగపరిచే 72వ ప్రపంచసుందరి పోటీలను విరవించుకోవాలని సూచించారు. ప్రపంచ సుందరీమణుల పోటీలకు హైదరాబాద్ నగరం వేదిక కానున్నదని సీఎం రేవంత్ గొప్పగా చెబుతున్నాడని, వీటితో తెలంగాణకు ఒరిగేదేమీ లేదని చెప్పారు.