Naini Coal Block | బీఆర్ఎస్ దెబ్బకు నైని బొగ్గు టెండర్ల రద్దు!
Naini Coal Block | తీవ్ర దుమారం రేపుతున్న నైని బొగ్గు గని టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తున్నట్టు సింగరేణి సంస్థ ప్రకటించింది. నైని కోల్ బ్లాక్‌కు సంబంధించిన టెండర్ల ప్రక్రియ లోపభూయిష్టంగా ఉన్నదని, అస్మదీయులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే.
Naini Coal Block | హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): తీవ్ర దుమారం రేపుతున్న నైని బొగ్గు గని టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తున్నట్టు సింగరేణి సంస్థ ప్రకటించింది. నైని కోల్ బ్లాక్‌కు సంబంధించిన టెండర్ల ప్రక్రియ లోపభూయిష్టంగా ఉన్నదని, అస్మదీయులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే. బొగ్గు గనుల టెండర్లలో అవినీతి జరుగుతున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేయడం, బీఆర్ఎస్ సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం వెనక్కితగ్గింది.
ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టెండర్లను రద్దు చేస్తామని ప్రకటించగా, టెండర్లను రద్దు చేస్తూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నిర్ణయం తీసుకున్నది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం కూడా సింగరేణి టెండర్ల బాగోతంపై దృష్టిపెట్టింది. టెండర్లను రద్దు చేయాలని, సీబీఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసిన నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో కేంద్ర గనుల శాఖ, సింగరేణి బోర్డులోని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఇక్కడి అధికారులతో సమావేశమయ్యారు.
‘జూమ్’ పద్ధతిలో జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించి చివరకు టెండర్లను రద్దు చేస్తున్నట్టు సింగరేణి సంస్థ ప్రకటించింది. మరోవైపు, కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి కూడా నైని బొగ్గు గని వ్యవహారంపై సమీక్ష నిర్వహించారు. సింగరేణి బోర్డు నుంచి సమగ్ర నివేదిక కోరారు. దీంతోపాటు కమిటీని నియమించాలని నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ ఆ శాఖ అండర్ సెక్రటరీ ప్రదీప్‌రాజ్ నారాయణ్ సింగరేణి సంస్థకు సమాచారం ఇచ్చారు.
ఇద్దరు సభ్యులతో సాంకేతిక కమిటీ
సింగరేణి సంస్థ గత ఏడాది నవంబర్ 25న నైని బొగ్గు గనిలో ‘మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ (ఎండీవో) కోసం ఇచ్చిన టెండర్‌ను సాంకేతికంగా పరిశీలించి, విశ్లేషించేందుకు ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ డీజీఎం చేతనాశుక్లా, డైరెక్టర్ మారపల్లి వెంకటేశ్వర్లు ఇందులో సభ్యులుగా ఉంటారని కేంద్ర బొగ్గు గనుల శాఖ ప్రకటించింది. ఈ కమిటీ మూడు రోజుల్లో నివేదిక అందజేస్తుందని పేర్కొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

