CCI| మంత్రి ఎర్రబెల్లిని కలిసిన సీసీఐ అధికారులు
మంత్రి ఎర్రబెల్లి | బుధవారం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ అమరనాథ్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులు మంత్రిని కలిశారు.

వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 9 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అందువల్ల కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు రైతులు పండించిన పత్తికి అధిక ధర వచ్చే విధంగా చూడాలని అధికారులను కోరారు. హన్మకొండలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో బుధవారం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ అమరనాథ్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పత్తి క్వింటాల్‌కు కనీస మద్దతు ధర 6025 రూపాయలుగా నిర్ణయించిందన్నారు.
నిర్ణయించిన మద్దతు ధర కన్నా ఎక్కువ ధరకు రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసే విధంగా చూడాలని అయన అధికారులను కోరారు. వరంగల్‌లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయ వసతి కోసం రాష్ట్ర ప్రభుత్వం భవనాన్ని కేటాయిస్తామని ఈ సందర్భంగా సీసీఐ అధికారులకు మంత్రి హామీ ఇచ్చారు.
సీసీఐ వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ బ్రాంచీల ద్వారా గత ఆర్ధిక సంవత్సరంలో 29 జిల్లాలలోని 112 కేంద్రాల ద్వారా 7 లక్షల 99 వేల 340 రైతుల నుంచి రూ.కోటి 78 లక్షల 90 వేల విలువైన 264 క్వింటాళ్ల పత్తిని సేకరించింది. 10167 కోట్ల 71 , 2 394 రూపాయలను చెల్లించినట్లు సీసీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ అమరనాథ్ రెడ్డి తెలిపారు. సీసీఐ కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వ భవనాన్ని కేటాయించినందుకు సీసీఐ అధికారులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారయత్నం కేసు
దారుణం : రైల్వే ట్రాక్‌పై యువతి మృతదేహం
Road accident |బొలెరో వాహనం బోల్తా..పది మందికి గాయాలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

