ఆధార్ తరహాలో విద్యార్థులకు అపార్
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఇకపై ఆధార్ తరహాలో అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) గుర్తింపు కార్డు అందుబాటులోకి రానున్నది.
- 17 అంకెలుండే గుర్తింపు కార్డు ఇవ్వనున్న కేంద్రం
- మార్గదర్శకాలు విడుదల
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఇకపై ఆధార్ తరహాలో అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) గుర్తింపు కార్డు అందుబాటులోకి రానున్నది. ‘వన్ నేషన్- వన్ ఐడీ’ పేరిట 17 అంకెలుండే ఈ కార్డులు ఇచ్చేందుకు గురువారం కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. కొన్ని రాష్ట్రాల్లోని విద్యార్థులకు ఇప్పటికే ప్రయోగాత్మకంగా అందించింది.
ఈ నెల16 నుంచి 18 వరకు తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థుల వివరాలను కేంద్ర విద్యాశాఖ సేకరించింది. విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు మారేక్రమంలో ఇదెంతో ఉపయోగకరమని తెలిపింది. విద్యార్థులు వేరే రాష్ర్టాలకు వెళ్లినప్పుడూ కూడా ఈ కార్డు చెల్లుబాటు అవుతుందని కేంద్రం పేర్కొన్నది. విద్యార్థుల పురోగతిని, డ్రాపౌట్ పర్యవేక్షణకు ఇది ఉపయోగపడుతుందని వెల్లడించింది. ఎన్టీఏ ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్లు, సాలర్షిప్ పంపిణీ, ప్రభుత్వ ప్రయోజన బదిలీ, అవార్డుల జారీ వంటి మొదలైన వాటిలో ఆపార్ ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్రం పేర్కొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

