హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలోని ఆయుధ తయారీ ఫ్యాక్టరీ (ఓఎఫ్ఎంకే)లో స్టోర్స్ ఇన్చార్జిగా పనిచేసిన ఓ అధికారిపై ఈ నెల 9న అక్రమాస్తుల కేసు నమోదు చేసినట్టు సీబీఐ బుధవారం ప్రకటించింది.
పదవీకాలంలో ఆ అధికారి భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడని, ఆ నిధులతో తన భార్య, కుటుంబసభ్యుల పేరిట స్థిర, చరాస్తులను కూడబెట్టారని తెలియడంతో తెలంగాణలోని 3 ప్రాంతాల్లో సోదాలు చేపట్టి రూ.2.17 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించినట్టు వెల్లడించింది. వాటితోపాటు 338 స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నది.