హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) రాత పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. పరీక్షను మూడు సెషన్లలో నిర్వహించనున్నట్టు ఐఐఎం లక్నో తెలిపింది.
ఉదయం 8:30 గంటల నుంచి 10:30 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 2:30 గంటల వరకు రెండో విడత, సాయంత్రం 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు మూడో విడత పరీక్ష ఉంటుందని వివరించింది. క్యాట్ పరీక్షకు 3.30 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు. జాతీయంగా 155 పట్టణాల్లో 400కు పైగా పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు.