కడ్తాల్, హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): క్యాసినో ఏజెంట్ చీకోటి ప్రవీణ్ ఫాంహౌజ్‌లో నిబంధనలకు విరుద్ధంగా వన్య ప్రాణులున్నాయా? అన్న కోణంలో అటవీశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్‌పల్లి శివారులోని అతని ఫాంహౌస్‌పై యాంటి పోచింగ్ స్కాడ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేశ్‌కుమార్ నేతృత్వంలో సోదాలు నిర్వహించారు.
ఫాంహౌస్‌లో పెంచుతున్న వివిధ రకాల పక్షులు, సర్పాలు, గుర్రాలు, కుక్కలను పరిశీలించారు. వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు. అటు.. ప్రవీణ్, మాధవరెడ్డి వ్యవహారంపై ఈడీ అధికారులు మరింత కూపీ లాగుతున్నట్టు సమాచారం. నగరానికి చెందిన నలుగురు హవాలా ఏజెంట్ల ఇండ్లు, కార్యాలయాల్లో శుక్రవారం సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. నగరానికి చెందిన ఓ ట్రావెల్స్ నిర్వాహకుడు క్యాసినో వ్యవహారాలు చక్కదిద్దినట్టు సమాచారం.