హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): అల్లోపతి వైద్యం చేస్తున్నారంటూ ఆయుష్ డాక్టర్లపై నమోదైన కేసులను హైకోర్టు కొట్టివేసింది. వారిపై నేరుగా చర్యలు తీసుకు నే అధికారం తెలంగాణ మెడికల్ కౌ న్సిల్ (టీఎంసీ)కి లేదని తీర్పు చెప్పిం ది. నిబంధనలకు విరుద్ధంగా ఆయుష్ డాక్టర్లు ప్రాక్టీస్ చేస్తుంటే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టంచేసింది. ఆయుష్ డాక్టర్లపై ఏమైనా ఫిర్యాదులు, పోలీసుల ప్రాథమిక నివేదిక ఉంటే వాటి ఆధారంగా చర్యలు తీసుకునే అధికారం ఆయుష్ కమిషనర్‌కు ఉన్నదని న్యాయస్థానం తెలిపింది. క్లినిక్‌లలో సోదాలు నిర్వహించడం, అల్లోపతి వైద్యం చేస్తున్నామంటూ టీఎంసీ ఫిర్యాదుల మేరకు తమపై కేసులు నమోదు చేయడం చెల్లదని సైబరాబాద్, సంగారెడ్డికి చెందిన ముగ్గురు డాక్టర్లు వేసిన పిటిషన్లపై జస్టిస్ తుకారాంజీ ఈ తీర్పు చెప్పారు.