హైదరాబాద్, మార్చి17 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఉద్యమానికి మద్దతివ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి (సీఏపీఎస్ఎస్) విజ్ఞప్తి చేసింది. ఈమేరకు సమితి అధ్యక్షుడు పరశురామ్ అసెంబ్లీలో కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
అంబేద్కర్ ఫొటోను ముద్రించాలనే డిమాండ్‌తో 26న ఢిల్లీలో వందలాది కళాకారులతో “ ధూం ధాం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ న్యాయమైన డిమాండ్‌కు సంపూర్ణ మద్దతూ తెలిపాలని కోరారు. దీనిపై కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్టు పరశురామ్ వెల్లడించారు.