Telangana Cabinet | తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ వాయిదా..? పీసీసీ ఎంపిక కూడా..?
Telangana Cabinet | ఈ నెల 4వ తేదీన తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూడా మీడియాకు లీకులిచ్చారు. కానీ కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. మంత్రివర్గ విస్తరణ వాయిదా పడినట్లు తెలుస్తోంది.
Telangana Cabinet | న్యూఢిల్లీ : ఈ నెల 4వ తేదీన తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూడా మీడియాకు లీకులిచ్చారు. కానీ కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. మంత్రివర్గ విస్తరణ వాయిదా పడినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక కూడా వాయిదా పడినట్లు సమాచారం.
కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతనే కేబినెట్ విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వారం రోజుల తర్వాత మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ భేటీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీల సమక్షంలో జరిగింది. నేతల అభిప్రాయాలను అధిష్ఠానం అడిగి తెలుసుకుంది.
పీసీసీ అధ్యక్ష నియామకంలో బీసీలకు అవకాశం కల్పించాలని ఒక అభిప్రాయానికి వచ్చినప్పటికీ, ఎవరికి ఇవ్వాలో నిర్ణయం తీసుకోలేకపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడం కంటే కొంత సమయం వేచి చూసి ఆ తరువాత చర్చించడం మంచిదని అగ్ర నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. ఇక మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిన ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కేబినెట్ విస్తరణ కూడా తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

