హైదరాబాద్/భద్రాచలం, డి సెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శు క్రవారం తెల్లవారుజామున మా రేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదంలో 15మంది మృతిచెందినట్టు సమాచారం.
బస్సు లో ఇద్దరు డ్రైవర్లు, 35 మంది యాత్రికులు ఉన్నారు. మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన రా వాల్సి ఉన్నది. ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. భద్రాచలం-మారేడుమిల్లి ఘాట్ రోడ్డును రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు మూసివేస్తున్నట్టు కలెక్టర్ శుభం నోక్వాల్ ప్రకటించారు.