ప్రజా సమస్యలపై నిలదీస్తాం
పార్లమెంట్లో మంగళవారం నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో గవర్నర్ల తీరుపై పార్లమెంట్లో చర్చ జరుగాలని డిమాండ్ చేశారు.
- తెలంగాణపై వివక్షను ఎండగడతాం
- గవర్నర్ వ్యవస్థపై చర్చించాల్సిందే
- పార్లమెంట్ అఖిలపక్ష సమావేశంలో బీఆర్ఎస్ నేతలు కేకే, నామా స్పష్టీకరణ
హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్లో మంగళవారం నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో గవర్నర్ల తీరుపై పార్లమెంట్లో చర్చ జరుగాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాను న్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అఖిలపక్ష నేతలను కోరింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు హాజరయ్యారు. తెలంగాణతో పాటు ఢిల్లీ, తమిళనాడు, కేరళ తదితర రాష్ర్టాల్లో గవర్నర్ వ్యవస్థతో ఇబ్బందులు ఉన్నాయని కేకే పేర్కొన్నారు. దీనితోపాటు దేశ సమాఖ్య వ్యవస్థపై పార్లమెంట్లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగం బహిషరణపై నిర్ణయం తీసుకున్నాక వెల్లడిస్తామని తెలిపారు.
మద్దతు ధరపై పట్టుబట్టాం: నామా
తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రధాన అంశాలను పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, తెలంగాణపై చేస్తున్న కుట్రలను ఎండగడతామని నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశంలో రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించినట్టు తెలిపారు. పంటలకు చెల్లించాల్సిన కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీపై చర్చ జరపాలని అఖిలపక్ష సమావేశంలో పట్టుబట్టినట్టు చెప్పారు. కేవలం బిల్లుల ఆమోదంపైనే కాకుండా దేశ సమస్యలపై దృష్టి పెట్టాలని కేంద్రానికి చెప్పామని, ఎస్బీఐ, ఎల్ఐసీ షేర్ల విలువ పడిపోవడాన్ని కూడా లేవనెత్తామని వివరించారు.
రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించనున్న బీఆర్ఎస్?
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం పార్లమెంట్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగాన్ని బహిష్కరించే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను పార్లమెంట్లో ఎండగట్టాలని, అందుకు కలిసివచ్చే పార్టీలతో సమిష్టి వ్యూహాన్ని అనుసరించాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదివారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- budget meetings
- Delhi
- Kerala
- lic
RELATED ARTICLES
తాజా వార్తలు
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

