బమ్మెరలో బౌద్ధ ఆనవాళ్లు
మహా భాగవత గ్రంథకర్త బమ్మెర పోతనామాత్యుడు పుట్టిన ఊరు బమ్మెరలో శిలాయుగ సంస్కృతితోపాటు బౌద్ధ, జైన చారిత్రక ఆధారాలు ఉన్నట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి తెలిపారు.
- చరిత్ర పరిశోధకుడు రత్నాకర్ రెడ్డి వెల్లడి
పాలకుర్తి రూరల్, ఏప్రిల్ 7: మహా భాగవత గ్రంథకర్త బమ్మెర పోతనామాత్యుడు పుట్టిన ఊరు బమ్మెరలో శిలాయుగ సంస్కృతితోపాటు బౌద్ధ, జైన చారిత్రక ఆధారాలు ఉన్నట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి తెలిపారు. ఇక్కడ ఐదు వేల ఏండ్ల కిం దట ఆది మానవులు జీవించినట్టు తెలుస్తున్నది. ఆ కాలంలో దంచేందుకు, నూరేందుకు ఉపయోగించిన రాతి పనిముట్లు ఇక్కడ లభించాయి. ఇక్కడ శాతవాహనుల కాలం నాటి బౌద్ధ ఆయక స్తంభం శకలాలు ఉన్నట్టు గతంలోనే ప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి ధ్రువీకరించారు.
బమ్మెర సమీప గ్రామం గూడూరులో బౌద్ధ స్తూపం ఉన్నట్టు కూడా తెలిపారు. బమ్మెర శివాలయం చాళుక్యుల కాలం నాటిదని తెలుస్తున్నది. చెరువు మత్తడి పరుపు బండపై బలపం రాయితో చేసిన భైరవి శిల్పం దిగంబరంగా ఉన్నది. పోతన స్మారక మందిరాన్ని ఆనుకొని ప్రాచీన వైష్ణవ ఆలయం ఉన్నట్టు తెలుస్తుండగా ఈ ఆలయానికి అడుగుల ఎత్తయిన ద్వారం ఉన్నది. లలాటబింబంగా తిరునామం, సీతారామచంద్రుల పాదాల బండ, ద్వారం ముందు ఆళ్వార్ విగ్రహం ఉన్నదని రెడ్డి రత్నాకర్‌రెడ్డి వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

