శేరిలింగంపల్లి, ఆగస్టు 16 : తమకు న్యాయం చేయాలని బీటీఎన్జీవోలు 32 రోజులుగా పోరాడుతున్నారు. అయినా, ప్రభుత్వం ఏమాత్రం కనికరించడం లేదు. తమ స్థలాలు తమకు ఇవ్వాలని గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల కార్యాలయం వద్ద రోజుకో తీరు నిరసనతో ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా శనివారం ప్లకార్డులు ప్రదర్శిస్తూ జేఏసీ ఐక్యత వర్థిల్లాలి.. ఉద్యోగులకు న్యాయం చేయాలి.. అంటూ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీటీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు రాజేశ్వర్రావు, సెక్రటరీ మల్లారెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, డైరెక్టర్లు ప్రభాకర్ రెడ్డి, రషీదాబేగం, సంధ్య, నర్సింహరాజు, ఏక్నాథ్గౌడ్, నాయక్, దామోదర్ పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.