KTR | పదేండ్లు పదవులు అనుభవించి.. కేకే, కడియం పార్టీ నుంచి జారుకున్నారు : కేటీఆర్
KTR | కే కేశవరావు, కడియం శ్రీహరి గత పదేండ్లు పార్టీలో అనేక పదవులు అనుభవించి ఇవాళ పార్టీ నుంచి జారుకున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
KTR | హైదరాబాద్ : కే కేశవరావు, కడియం శ్రీహరి గత పదేండ్లు పార్టీలో అనేక పదవులు అనుభవించి ఇవాళ పార్టీ నుంచి జారుకున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటానని చెప్పి ఇవాళ కాసాని జ్ఞానేశ్వర్ ముందుకు వచ్చారు. అవకాశం ఇస్తే చేవెళ్లలో నేను నిలబడుతానని చెప్పారు. దీంతో కేసీఆర్ ఆయనకు అవకాశం కల్పించారు. కాసాని ధీరోదాత్తమైన నాయకుడు. బలహీన వర్గాల ముద్దుబిడ్డ, బడుగుల ఆశాజ్యోతి అని చాలా మంది అనేక ప్రసంగాలు ఇచ్చారు. అలా బీసీ జాతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్. ఒక్క రంగారెడ్డి జిల్లాకే కాదు.. రాష్ట్రం మొత్తానికి ఆయన సుపరిచితుడు. ముదిరాజ్‌లకు ఎంతో సేవ చేశారు అని కేటీఆర్ తెలిపారు.
కష్టకాలంలో మన కోసం వచ్చిన కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి. మన కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కే కేశవరావు, కడియం శ్రీహరి పార్టీ నుంచి జారుకుంటున్నారు. ఈ సమయంలో ధీరోదాత్తంగా నిలబడి నేనున్నా అంటూ ముందుకు వచ్చిన నాయకుడిని కడుపులో పెట్టుకోవాల్సిన బాద్యత మనపై ఉంది. చేవెళ్లలో నిలబడ్డది కేసీఆర్.. అనుకొని కొట్లాడుదాం. ఆయన కోసం ఓటేస్తాం అనే కమిట్మెంట్తో పని చేద్దాం. పదేండ్లు పదవులు అనుభవించిన తర్వాత.. పోయేవాళ్లు రెండు రాళ్లు వేసి పోతారు. అది వారి విజ్ఞతకే వదిలేద్దాం.. కాలమే సమాధానం చెప్తుందని కేటీఆర్ అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

