KTR | నువ్వు మొగోనివి అయితే ఈ పనులు చేసి చూపెట్టు.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. నీ ఫెవరేట్ డైలాగ్ ఉంది కదా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలంటించారు.
KTR | వికారాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. నీ ఫెవరేట్ డైలాగ్ ఉంది కదా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలంటించారు. వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
నీ డైలాగ్.. అదే ఫెవరేట్ డైలాగ్ ఉంది కదా.. మొగోనివి అయితే గెలువు అన్నావు కదా.. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి.. మొగోనివి అయితే రైతులకు చెప్పిన రెండు లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు. నువ్వు మొగోనివి అయితే రూ. కోటి 67 లక్షల ఆడబిడ్డలకు చెప్పిన రూ. 2500 ఇచ్చి చూపెట్టు. నువ్వు మొగోనివి అయితే ముసలవ్వకు, ముసలయ్యకు రూ. 4000 పెన్షన్ ఇస్తా అన్నది ఇచ్చి చూపెట్టు. మొగోనివి అయితే కరెంట్ ఇవ్వు. మొగోనివి అయితే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురా అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.
ఈ పనులు చేయకుండా ఎంతసేపు సొల్లు పురాణం.. కేసీఆర్ను తిట్టడం తప్ప కొత్త మాట మాత్రం లేదు. మనం పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. రుణమాఫీ చేయకున్నా మాకే ఓటేశారు. రైతుబంధు ఇవ్వకపోయినా మాకే ఓటేశారు. పెన్షన్లు ఇవ్వకున్నా మాకే ఓటేశారు అని చెప్పి ఏవీ ఇవ్వరు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి అని కేటీఆర్ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

