KTR | రాజముద్రపై అరాజకీయం.. ఉద్యమకారుల్ని పొట్టనబెట్టుకున్న కాంగ్రెస్: కేటీఆర్
, కాంగ్రెస్ సర్కారు రాజకీయ కుట్రతోనే రాష్ట్ర రాజముద్రలో మార్పులు చేస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. చిహ్నంలో చార్మినార్ చిత్రం లేకుండా చేయడమంటే హైదరాబాద్ ప్రజలను అవమానించినట్టేనని మండిపడ్డారు.
- చార్మినార్‌ను తొలగించడం హైదరాబాదీలను అవమానించడమే: కేటీఆర్
- రాజకీయ కుట్రతోనే చిహ్నంలో మార్పులు
- రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు
- సోనియాను బలిదేవత అంటూ రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలను ప్రజలు మరిచిపోలేదు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
- చార్మినార్ వద్ద బీఆర్ఎస్ నేతల నిరసన
KTR | హైదరాబాద్/ సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు రాజకీయ కుట్రతోనే రాష్ట్ర రాజముద్రలో మార్పులు చేస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. చిహ్నంలో చార్మినార్ చిత్రం లేకుండా చేయడమంటే హైదరాబాద్ ప్రజలను అవమానించినట్టేనని మండిపడ్డారు. తెలంగాణ రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిత్రాన్ని తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నో పోరాటాలు, మరెన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శించారు. చారిత్రక ఆనవాళ్ల విషయంలో కాంగ్రెస్ సర్కారు రాద్ధాంతం చేస్తున్నదని ఫైరయ్యారు. రాష్ట్ర ముద్రలో మార్పుల నేపథ్యంలో మాజీ మంత్రులు పద్మారావుగౌడ్, పొన్నాల లక్ష్మయ్య, కేశవరావు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పార్టీ శ్రేణులతో కలిసి గురువారం కేటీఆర్ చార్మినార్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే చిహ్నంలో మార్పులు చేస్తున్నదని విమర్శించారు. హైదరాబాద్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది చార్మినార్ అని చెప్పారు.
సోనియాను బలిదేవతన్న రేవంత్‌ను మర్చిపోలే
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాను బలిదేవత అని రేవంత్‌రెడ్డి విమర్శించిన విషయాన్ని ఆయన మరిచిపోయినా.. తెలంగాణ ప్రజలు మరిచిపోలేదని కేటీఆర్ గుర్తుచేశారు. ఎంతో మంది ప్రాణాలు తీసుకోవడానికి కాంగ్రెస్ కారణం అనే విషయాన్ని కూడా అమరుల కుటుంబాలు ఇంకా మరువలేవని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్‌కు కనపడటం లేదా? అని నిలదీశారు. గ్లోబల్ ఐకానిక్‌గా ఉన్న చార్మినార్ చిత్రాన్ని రాజముద్ర నుంచి తొలగించాల్సిన
అవసరం ఏమున్నదని ప్రశ్నించారు. లోగోలను మార్చి ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దని హితవుపలికారు. అంతగా మార్పులు చేయాలనుకుంటే అమరుల స్థూపం, తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను చేర్చుకోవాలని సూచించారు. తెలంగాణ చారిత్రక మౌలిక స్వరూపాన్ని తొలగించాలని చూడటం సరికాదని, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.
చార్మినార్‌కు యునెస్కో అర్హతలు: కేటీఆర్
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చార్మినార్ చిత్రాన్ని పనికిమాలిన కారణాలను చూపుతూ రాష్ట్ర చిహ్నం నుంచి కాంగ్రెస్ సర్కారు తొలగించాలని చూస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా శతాబ్దాలుగా చార్మినార్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నదని గురువారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. చార్మినార్‌కు ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందే అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

