KTR | రాజోలి రైతులకు బేడీలు.. సీఎం రేవంత్‌పై మండిపడ్డ కేటీఆర్
KTR | జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతుల చేతులకు సీఎం రేవంత్ రెడ్డి బేడీలు వేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
KTR | హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతుల చేతులకు సీఎం రేవంత్ రెడ్డి బేడీలు వేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అలంపూర్ కోర్టు వద్ద అన్నదాతలకు పోలీసులు సంకెళ్లు వేసిన సంఘటన ముఖ్యమంత్రి రాక్షస మనస్తత్వానికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్ద ధన్వాడలో గత కొన్ని నెలలుగా ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అనేక గ్రామాల ప్రజలపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే దారుణమైతే.. చివరికి దొంగలు, నేరస్తుల లాగా బేడీలు వేయడం క్షమించరాని నేరం అని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో లగచర్లలో అల్లుడి ఫార్మా కంపెనీని అడ్డుకున్నారనే కోపంతో గుండెపోటు వచ్చిన రైతుపై కనికరం కూడా లేకుండా బేడీలు వేసి, ఈ ముఖ్యమంత్రి మహాపాపాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు పెద్ద ధన్వాడ రైతుల విషయంలో కూడా ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి అన్నదాతల చేతిలో గుణపాఠం తప్పదు. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుంది కాబట్టి రేవంత్ వెంటనే రైతులందరికీ క్షమాపణ చెప్పాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. చివరగా జై కిసాన్ అని కేటీఆర్ నినదించారు.
జోగులాంబ గద్వాల్ జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతుల చేతులకు సీఎం రేవంత్ బేడీలు వేయడం అత్యంత దుర్మార్గమైన చర్య
అలంపూర్ కోర్టు వద్ద అన్నదాతలకు పోలీసులు సంకెళ్లు వేసిన సంఘటన ముఖ్యమంత్రి రాక్షస మనస్తత్వానికి పరాకాష్ట
పెద్ద ధన్వాడలో గత కొన్ని నెలలుగా… pic.twitter.com/WB4TVu2zBs
— KTR (@KTRBRS) June 18, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

