ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత.. ఏ ఎన్నికైనా కాంగ్రెస్‌కు భంగపాటే.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్దే గెలుపు
ఖైరతాబాద్, అక్టోబర్ 9: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ రోజురోజుకూ పెరుగుతున్నదని, కాంగ్రెస్ మూడేండ్ల పాలన పూర్తిగా విఫలమవడంతో తిరిగి బీఆర్ఎస్నే గెలిపించాలని ఓటర్లు భావిస్తున్నారని చాణక్య స్ట్రాటజీస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని, బీఆర్ఎస్కు అనుకూల పవనాలు వీస్తున్నాయని చెప్పారు. శుక్రవారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ… రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖైరతాబాద్ ఉపపోరు ఫలితాలపై తమ సంస్థ నిర్వహించిన సర్వే అంచనాలను వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ఉపఎన్నికల వాతావరణం ఏర్పడిందని, ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని పేర్కొన్నారు.
ప్రస్తుతం అభ్యర్థులు ఇంకా ఖరారు కాకపోవడంతో నియోజకవర్గంలోని పలు డివిజన్ల పరిధిలో ఇటీవల 1,000 శాంపిల్స్‌తో సర్వే నిర్వహించామని తెలిపారు. ఖైరతాబాద్‌లో కాంగ్రెస్‌తో పోలిస్తే బీఆర్ఎస్ గ్రాఫ్ అమాంతంగా పెరిగినట్లు సర్వేలో తేలిందని చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి బీఆర్ఎస్కు అనుకూల స్పందన వస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున దానం నాగేందర్ పోటీ చేస్తారా? లేదా? అనేది ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ, ఎవరు పోటీ చేసినా కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నుంచి ఇద్దరు, ముగ్గురి పేర్లు వినపడుతున్నాయని వారిలో ఎవరు పోటీ చేసినా బీఆర్ఎస్పై ఉన్న అనుకూలత వల్ల అవలీలగా గెలుస్తారని పేర్కొన్నారు.
అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి కవిత, తెలంగాణ రాజ్యాధికార సమితి తరపున తీన్మార్ మల్లన్న వంటి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయని, అభ్యర్థుల ఎంపిక తర్వాతే పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు. ఖైరతాబాద్‌లో బీసీ ఓటర్ల ప్రభావం ఉంటుందని, ముఖ్యంగా యాదవ, ముదిరాజ్ సామాజికవర్గాల ఓట్లు ఎకువగా ఉన్నాయని వివరించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి జూబ్లీహిల్స్ తరహాలోనే పవర్ పాలిటిక్స్ ప్లే చేసే అవకాశం కూడా ఉన్నదని అభిప్రాయపడ్డారు. అయినా ప్రజల మొగ్గు బీఆర్ఎస్ వైపే ఉన్నదని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌పై పెరుగుతున్న అసంతృప్తి
ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తున్నది చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముఖేశ్ స్పష్టంచేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజలు కోపంగా ఉన్నారని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పాలనపై ఆగ్రహంగా ఉన్నట్లు తమ సర్వేలో తేలిందని వెల్లడించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్కు అనుకూల పవనాలు వీస్తున్నాయని, అయితే ఆ పార్టీ నాయకత్వం, క్యాడర్ దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే ఫలితం ఇంకా మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్దే హవా
రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్రోల్మెంట్ ప్రక్రియ శరవేగంగా జరుగుతున్నదని, ఆశావహులు, స్వతంత్రుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ముఖేశ్ తెలిపారు. కాంగ్రెస్ నుంచి ఉమ్మడి నల్లగొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గం నుంచి సర్వోత్తమ్‌రెడ్డిని ఇప్పటికే ప్రకటించారని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి అధికారిక ప్రకటన రాకున్నా విద్యావంతులు కాంగ్రెస్, బీజేపీ కంటే బీఆర్ఎస్ను గెలిపిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారని వెల్లడించారు. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్కు బలమైన అనుకూలత ఉన్నదని, 70 శాతానికి పైగా ఓట్లు వరంగల్ నుంచి దక్కించుకుంటుందని పేర్కొన్నారు.
నల్లగొండ, ఖమ్మంలోనూ బీఆర్ఎస్ ఆధిక్యత సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. ఖమ్మంలో ఏ పార్టీ నాయకుడు ఎకువ ఓట్లను క్రాస్, లాకోగలిగితే ఆ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుందని చెప్పారు. ఖమ్మం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న మండం కిరణ్ ఓట్లను చీల్చే అవకాశం ఉన్నదని, అది బీఆర్ఎస్ అభ్యర్థికి కలిసొచ్చే అంశమని అంచనా వేశారు. గతంలో ఓడిపోయారనే సెంటిమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వెరసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి అవకాశాలను పెంచుతున్నాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
అప్పీలులో దాఖలుకు 250 రోజులా?.. రాష్ట్ర సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు.. విద్యాశాఖకు 25 వేలు జరిమానా
తుకుగూడలో కొత్త తెలుగు శాసనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

