హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): డీఎస్సీని మూడు నెలలు వాయిదా వేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామియాదవ్ డిమాండ్ చేశారు. టెట్లో అర్హత సాధించిన విద్యార్థులు డీఎస్సీకి ప్రిపేర్ కావడానికి 3 నెలల సమయం ఇవ్వాలని కోరా రు.
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు రేవంత్రెడ్డి మెగా డీఎస్సీని వేయాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం నిరుద్యోగులను వాడుకొని సీట్లో కూర్చోగానే ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారంటూ మండిపడ్డారు. ఓయూలో దమనకాండకు తెరలేపారని పేర్కొన్నారు.