హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా బీఆర్ఎస్(BRS) పార్టీ సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం నల్లగొండ లోక్సభ(Nallagonda Lok Sabha) నల్లగొండ లోక్సభ పరిధిలోని నియోజకవర్గాలకు చెందిన నేతలంతా హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణ, గెలుపు వ్యూహాలపై చర్చిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.