CM KCR | నేడు సిరిసిల్ల, సిద్దిపేటకు సీఎం కేసీఆర్.. భారీ ఏర్పాట్లు చేసిన బీఆర్ఎస్
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు తొలుత సిరిసిల్ల, తర్వాత సిద్దిపేట సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటా రు.
- ప్రాంగణాల్లో సీఎం, మంత్రులు కేటీఆర్, హరీశ్ కటౌట్లు
హైదరాబాద్/రాజన్నసిరిసిల్ల/ సిద్దిపేట, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు తొలుత సిరిసిల్ల, తర్వాత సిద్దిపేట సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటా రు. ఇందుకు రెండు పట్టణాలు ముస్తాబయ్యాయి. సిరిసిల్ల మొదటి బైపాస్‌రోడ్డులో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి అర కిలోమీటరు దూరంలో విశాలమైన స్థలంలో సభకు బీఆర్ఎస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తున్నది.
గులాబీ జెండాలు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కటౌట్లతో సిరిసిల్ల పట్టణం గులాబీమయమైంది. జిల్లా నలుమూలల నుంచి లక్ష మందిని తరలించనుండగా, అందుకు అనుగుణంగా ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ముఖ్య నాయకులంతా ఏర్పాట్లలో తలమునకలయ్యారు. సిద్దిపేట శివారులోని నాగదేవత గుడి బైపాస్‌లో సిరిసిల్ల వెళ్లే రోడ్డులో మంగళవారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం సభ ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. లక్ష మందితో జరిగే సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. సుమారు 20 వేల మంది బైక్ ర్యాలీ సభా ప్రాంగణానికి చేరుకోనున్నది. ప్రాంగణం చుట్టూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కటౌట్లు పెట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

