MLC Kavitha | కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాల్సిందే.. సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ
MLC Kavitha | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి ఇంకెంత కాలం తాత్సారం చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
MLC Kavitha | హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి ఇంకెంత కాలం తాత్సారం చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన పూర్తి చేసి రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంకా అమలు చేయకపోవడం శోచనీయమన్నారు.
ఈ మేరకు గురువారం నాడు ఎమ్మెల్సీ కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. బీసీలకు ఏటా రూ. 20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి 2024-25 బడ్జెట్లో అరకొర కేటాయింపులు చేసి తొలి ఏడాదే కామారెడ్డి డిక్లరేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఉల్లంఘించారని విమర్శించారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల బీసీ వర్గాల్లో ఏ మాత్రం విశ్వాసం లేదని, ఈ వైఖరితో రాష్ట్రంలో బీసీలంతా తీరని అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు.
డెడికేటెడ్ కమిషన్ పేరిట కాలయాపన..
“కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రధాన హామీ అయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించడం. “కుల గణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీలకు రిజర్వేషన్ల పెంపు” అని కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో స్పష్టంగా పేర్కొని ఉంది. 6 నెలలు గడిచాయి… ఏడాది గడిచింది.. అయినా కూడా రిజర్వేషన్ల పెంపునకు అతీగతీ లేదు. అశాస్త్రీయంగా బీసీ గణన నిర్వహించి, డెడికేటెడ్ కమిషన్ పేరిట కాలయాపన చేయడమే మీ ఆలోచనగా కనిపిస్తోంది.” అని తెలిపారు.
బీసీలంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చులకన..?
కులగణన పూర్తయ్యి కూడా చాలా కాలం అవుతుందని, కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ వివరాలను బహీర్గతం చేయలేదని ఎండగట్టారు. ఆ వివరాలను తక్షణమే బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని, డెడికేటెడ్ కమిషన్ నివేదిక సిద్ధమైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. “ బీసీల అంశాల పట్ల మీ ప్రభుత్వం ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తోంది ? బీసీలంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చులకన ? 6 నెలల్లోపే అమలు చేస్తామన్న హామీ 12 నెలలు గడిచినా ఎందుకు అమలు చేయడం లేదు ? హామీని అమలు చేయడానికి ఇంకెంత కాలం పడుతుంది..?” అని ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రజా పాలన కాకుండా ప్రత్యేకాధికారుల పాలన..
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసి దాదాపు ఏడాది పూర్తయ్యిందని, మండల, జిల్లా పరిషత్‌ల పదవీకాలం కూడా ముగిసిందని, ప్రస్తుతం గ్రామాల్లో ప్రజా పాలన కాకుండా ప్రత్యేకాధికారుల పాలన సాగుతోందని వివరించారు. కానీ మీ ప్రభుత్వానికి త్వరగా రిజర్వేషన్లను పెంచి ఎన్నికలను నిర్వహించాలన్న సోయిలేనట్లు అర్థమవుతోందని అనుమానం వ్యక్తం చేశారు.
రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాల్సిందే..
బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాల్సిందేనని తేల్చిచెప్పారు. కుంటిసాకులు చెప్పి ఇచ్చిన మాట కంటే తక్కువ రిజర్వేషన్లు కల్పిస్తే మాత్రం తెలంగాణ సమాజం మిమ్మల్ని సహించబోదని, బీసీల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ మీ మెడలు వంచి హామీని అమలు చేయించుకుంటామని హెచ్చరించారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లను తక్షణమే 42 శాతానికి పెంచడానికి చర్యలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. ఖోఖో ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి
Rahul Gandhi | రాహుల్ గాంధీకి అనారోగ్యం.. ఎన్నికల ర్యాలీ రద్దు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

