Harish Rao | బీఏసీ అంటే బిస్కెట్ అండ్ చాయ్ సమావేశం కాదు : హరీశ్‌రావు ఎద్దేవా
Harish Rao | బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కనీసం 15 రోజులు సభ నడపాలని బీఆర్ఎస్ తరఫున బీఏసీ మీటింగ్‌లో డిమాండ్ చేశామని తెలిపారు. కానీ ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పకపోవడంతో సమావేశం నుంచి వాకౌట్ చేశామని స్పష్టం చేశారు.
Harish Rao | బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కనీసం 15 రోజులు సభ నడపాలని బీఆర్ఎస్ తరఫున బీఏసీ మీటింగ్‌లో డిమాండ్ చేశామని తెలిపారు. కానీ ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పకపోవడంతో సమావేశం నుంచి వాకౌట్ చేశామని స్పష్టం చేశారు.
రేపు అసెంబ్లీలో లగచర్ల అంశంపై చర్చకు డిమాండ్ చేశామని హరీశ్‌రావు తెలిపారు. ఒక రోజు ప్రభుత్వానికి, మరొక రోజు విపక్షానికి అవకాశం ఇవ్వడం సంప్రదాయమని పేర్కొన్నారు. లగచర్ల అంశంపై చర్చకు పట్టుబట్టామని.. రైతులకు బేడీలు వేసిన అంశం తమకు చాలా కీలకమని బీఏసీలో తెలిపామని అన్నారు. కచ్చితంగా ఈ అంశంపై చర్చకు అవకాశం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశామని తెలిపారు. కానీ బీఏసీకి కేవలం సూచన చేసే అధికారం మాత్రమే ఉందని సీఎం వ్యాఖ్యానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఏసీ చెప్పినట్టే సభ నడుస్తుందని వివరించామన్నారు. హౌస్ కమిటీలను ఏర్పాటు చేయాలని కోరామని తెలిపారు.
బీఏసీపై తమ పార్టీ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని స్పీకర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడిగారని హరీశ్‌రావు తెలిపారు. ఎమ్మెల్యేల ప్రొటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని తెలిపారని చెప్పారు. బీఏసీ లేకుండా సభలో బిల్లులు ప్రవేశపెట్టడంపైన అభ్యంతరం వ్యక్తం చేశామని అన్నారు. పుట్టిన రోజులు, పెళ్లిలు ఉన్నందుకు సభ వాయిదా వేయడంపైన అభ్యంతరం తెలిపామని పేర్కొన్నారు. కౌలు రైతులకు 12 వేల సాయం అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసన సభ వెలుపల ప్రకటన చేయడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాసన సభలో ప్రతిరోజు జీరో అవర్ ఉండాలని డిమాండ్ చేశామని హరీశ్‌రావు తెలిపారు. తమ పార్టీకి ఉన్న సభ్యుల సంఖ్య మేరకు మాట్లాడే సమయం ఇవ్వాలని కోరామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీషర్టులతో వస్తే అడ్డుకున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ టీషర్టులతో పార్లమెంటులోకి వెళ్లినప్పుడు.. మమ్మల్ని ఎలా ఆపుతారని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Assembly
- BAC
- BRS
- harish rao
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

