MLA Jagadish Reddy | పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు కావాలి : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
MLA Jagadish Reddy | బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు కావాల్సి ఉందన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
MLA Jagadish Reddy | హైదరాబాద్ : బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు కావాల్సి ఉందన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
చట్టం ప్రకారం డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి సభ్యత్వాలు రద్దు కావాలి. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు స్పీకర్‌ను సమయం కోరాం. వెసులుబాటు చూసుకొని సమయం ఇస్తానని స్పీకర్ చెప్పారు. స్పీకర్ న్యాయంగా సమయం ఇస్తారని ఆశిస్తున్నాం. అనర్హత పిటిషన్లపై ఈ నెల 27న హైకోర్టులో విచారణ ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను వంచిస్తోంది. రాహుల్ కాంగ్రెస్‌ది ఒక విధానం.. రేవంత్ కాంగ్రెస్‌ది మరో విధానం. గత పదేండ్లలో ఫిరాయింపులను ప్రోత్సహించింది బీజేపీ. బీజేపీకి తోకగా తెలంగాణ పీసీసీ వ్యవహరిస్తోంది అని జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాన్సువాడ, జగిత్యాల ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలుపొందారు. వీరిద్దరిని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరిపై గులాబీ శ్రేణులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

