Kadiyam Srihari | అసెంబ్లీలో సీఎం రేవంత్ అనుచిత భాషను ఖండిస్తున్నాం : కడియం శ్రీహరి
Kadiyam Srihari | అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న అనుచిత భాషను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. మీడియా పాయింట్‌కు వెళ్లకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడంతో వారు నిరసనకు దిగారు.
Kadiyam Srihari | హైదరాబాద్ : అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న అనుచిత భాషను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. మీడియా పాయింట్‌కు వెళ్లకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడంతో వారు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. చెప్పలేని భాషలో రేవంత్ మాట్లాడుతున్నారు. అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయి. రికార్డుల నుంచి తొలగించాలని మేము కోరుదామంటే మాకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వడం లేదు. సీఎం భాషకు ధీటుగా బదులు ఇవ్వగలం.. కానీ పార్లమెంటరీ సంప్రదాయాల మీద మాకు గౌరవం ఉందన్నారు.
ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై సీఎం దిగజారి మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడతామంటే ఆవకాశం ఇవ్వలేదు. బయట మీడియాతో మాట్లాడతామంటే నిబంధనల పేరిట అడ్డుకుంటున్నారు. కంచెలు తొలగిస్తామని ఇదేమి కంచెల పాలనా ? అని కడియం శ్రీహరి ప్రశ్నించారు.
అసెంబ్లీ లో సీఎం రేవంత్ అనుచిత భాషను ఖండిస్తున్నాం
చెప్పలేని భాషలో రేవంత్ మాట్లాడుతున్నారు.. అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయి.. రికార్డుల నుంచి తొలగించాలని మేము కోరుదామంటే మాకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వడం లేదు
సీఎం భాషకు ధీటుగా బదులు ఇవ్వగలం.. కానీ పార్లమెంటరీ… pic.twitter.com/plN0m5yqWw
— BRS Party (@BRSparty) February 14, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

