యాదాద్రి భువనగిరి : ధాన్యం కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. తుర్కపల్లి మండలంలోని ముల్కలపల్లి గ్రామస్తులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తుర్కపల్లి ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. చాటలతో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ధర్నాతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.