రెండో పంట వేయొద్దనడం సిగ్గుచేటు
ఇది కాలం తెచ్చింది కాదని, ము మ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, సత్తుపల్లి మాజీ ఎమ్మె ల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించా రు.
- ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర
ఖమ్మం కమాన్బజార్, అక్టోబర్ 16: ఇది కాలం తెచ్చింది కాదని, ము మ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, సత్తుపల్లి మాజీ ఎమ్మె ల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించా రు. రైతులు రెండో పంట వేయొద్దనడం సర్కార్ చెప్పడం సిగ్గుచేటు అన్నారు. నీటి యాజమాన్య పద్ధతులు తెలియక సాగును సంక్షోభంలోకి నెట్టడం దారుణమని పేర్కొన్నారు.
ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం(తెలంగాణ భవన్)లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తాతా మధు మాట్లాడుతూ.. కేసీఆర్ పదేండ్ల పాలనలో 24గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, ఇంటింటికీ నల్లా నీళ్లు, మిషన్ కాకతీయతో చెరువులను నింపి వ్యవసాయాన్ని పండుగలా మార్చిన విషయాన్ని గుర్తుచేశారు.
కానీ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాతరోజులు వచ్చాయని విమర్శించారు. విత్తన కం పెనీలకు నోటీసులు ఇచ్చి రెండో పంట కు విత్తనాలు అమ్మొద్దని చెప్పడం దు ర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. సండ్ర మాట్లాడుతూ.. తెలంగాణలో బొగ్గు నిక్షేపాలు ఉన్నా కృత్రిమ కొరత సృష్టిం చి థర్మల్పవర్ ఉత్పత్తిని తగ్గించారని విమర్శించారు. వ్యవసాయానికి కోత లు లేకుండా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

