BRS Rythu Deeksha | రైతుల కోసం బీఆర్ఎస్ పోరుబాట.. రాష్ట్రవ్యాప్తంగా రైతుదీక్ష
రైతుల కోసం బీఆర్ఎస్ (BRS) పోరుబాటపట్టింది. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై సమరభేరి మోగించింది. అన్నదాతలకు మద్దతుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు దీక్షలు (Rythu Deeksha) చేస్తున్నారు.
హైదరాబాద్: రైతుల కోసం బీఆర్ఎస్ (BRS) పోరుబాటపట్టింది. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై సమరభేరి మోగించింది. అన్నదాతలకు మద్దతుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు దీక్షలు (Rythu Deeksha) చేస్తున్నారు. సాగునీరు అందక, కరెంటు లేక లక్షలాది ఎకరాల్లో పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పంట ఎండిపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని, వరి, మక్కలకు క్వింటాలకు రూ.500 బోనస్ ఇవ్వాలని, రైతులకు వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇవ్వాలన్నారు. ఎక్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సిరిసిల్లాలో జరిగిన దీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన రైతు దీక్షలో ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. నర్సంపేట పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎంపీ మాలోతు కవిత, వర్ధన్నపేట దీక్షలో మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. అన్ని రకాల పంటలకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన దీక్షలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన దీక్షకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, రైతులు, బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. నల్లగొండ, నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యేలు కృష్ణారెడ్డి, చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. జనగామ ఆర్టీసీ జరిగిన దీక్షలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువన్నారు. సాగునీరు అందక వేల ఎకరాల్లో పంట ఎండిపోయి రైతులు అరిగోస పడుతున్నారని చెప్పారు. హామీ ప్రకారం వరికి క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు. సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9న రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, అది ఇప్పటివరకు అమలు నోచుకోలేదని విమర్శించారు.

నారాయణపేట మున్సిపల్ పార్క్ వద్ద జరిగిన దీక్షలో మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. జనగామ జిల్లా పాలకుర్తిలో జరిగిన దీక్షలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గద్వాల జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దీక్షలో పాల్గొన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- farmers
- harish rao
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఉత్తరాంధ్రకు మళ్లీ తుపాను ముప్పు.. 18, 19 తేదీల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్..!
Master Bharat | నటనకు దూరమవుతున్నాననే వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన మాస్టర్ భరత్
RS Praveen Kumar | కాంగ్రెస్ పార్టీకి నాలుగో అనుబంధ సంస్థ తెలంగాణ రక్షణ సేన : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Actor Giribabu | టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత!
Punjab | యువతకు పంజాబ్ సర్కారు క్విజ్ పోటీ.. విజేతకు రూ.కోటి బహుమతి..!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

