RS Praveen Kumar | బెల్ట్ షాపులు వద్దని పోరాడిన బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా జైలుకు పంపించారని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఊరుకు పోయినా మాకు బెల్ట్ షాపులు కావాలని కోరుకోదు. ఎందుకంటే మా అక్కలు, అన్నలు ఇక్కడే ఉన్నరు. ఎవరైనా మా భర్తలు కానీ మా పిల్లలు కానీ సారాయి తాగాలని అనుకుంటరా.. ఎవ్వరూ కూడా ఇది లేకపోతేనె బాగుండు రా బిడ్డ. ఈ 90 ఎంఎల్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఇది గత్తర లాగా తగిలింది.. ఈ 90 ఎంఎల్ లేకుంటే బాగుండనకుంటరు.. ఎందుకంటే ఆల్కాహాల్ అనేది విషం. అది మొత్తం ఊరునే నాశనం చేస్తది.. ఈ ఊళ్లో ఉండే యువకులు దాన్ని ఊర్లోకెళ్లి తీసేయండయ్యా అన్నరు. దానికి ఈ ఊర్లో వాళ్లు వీళ్లు తోసుకున్నరు.. అయిపోయింది.
ఒక వర్గం బీఆర్ఎస్ పార్టీ వాళ్లేమో ఆ కౌంటర్లోకెళ్లి 90 వేల రూపాయలు తీసుకొని వాళ్లను కొట్టి తీసుకుపోతమని చెప్పిపోవడానికి సిద్దమైర్రు.. అని ఎఫ్ఐఆర్లో రాసిర్రు. నేను ఎస్ఐను అడిగితే అవును సార్ ఎఫ్ఐఆర్ ప్రకారమే చేసినం అన్నరు. మరి అందులో పెట్టిన సెక్షన్లు చూస్తే అన్ని కూడా స్టేషన్ బెయిల్ ఇవ్వదగిన సెక్షన్లే పెట్టిర్రు. అట్ల పెట్టినప్పుడు స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాలే కదా.. స్టేషన్లో బెయిల్ ఇవ్వకుండా సీదా తీసుకుపోయి రాత్రి 2 గంటలకు మేజిస్ట్రేట్ దగ్గర నిలబెట్టిండు. రాత్రి 2 గంటలకు ఏ వకీలు వస్తడు.. ఏ వీళ్లను జల్దీ జైలుకు పంపండి.. నాకు నిద్ర వస్తుంటే నిద్ర లేపుతరా మీరు అంటరు. ఆ మేజిస్ట్రేట్ కోపంతోనైనా వీళ్లను ఫస్ట్ జైలుకు పంపండి తర్వాత బెయిల్ వచ్చినప్పుడు చూసుకుందాం అంటడు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. .
నేను పోలీస్ అధికారులను అడిగిన అవును కరెక్టే వీళ్లు బెల్ట్ షాపు వద్దన్నరు.. వాళ్ల మీద కూడా కేసు కావాలె కదా.. వీళ్లు కనీసం ఫిర్యాదు చేస్తే దాని కనీసం సంతకం కూడా పెట్టలేదు పోలీసులు. ఇవాళ నేను, జనార్దన్ రెడ్డి డీఎస్పీతో, ఎస్ఐతో మాట్లాడినం. వాళ్ల పై అధికారితో కూడా మాట్టాడినం. బరాబర్ దీన్ని ఉన్నతాధికారుల దగ్గరికి తీసుకుపోతం. ఉన్నతాధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకునే దాకా మేము పోరాడుతూనే ఉంటామని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
బెల్ట్ షాపులు వద్దని పోరాడిన బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా జైలుకు పంపించారు
స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టినా కావాలనే అర్ధరాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టి జైలుకు పంపించారు
బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేసిన పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకునే వరకు… pic.twitter.com/Ly85au0IHd
— Telugu Scribe (@TeluguScribe) May 28, 2026