సీఎం రేవంత్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
ప్రతిపక్ష పార్టీల నేతలతోపాటు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, మక్కన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ తదితరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలం టూ బీఆర్ఎస్ నాయకులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- భయభ్రాంతులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు
బంజారాహిల్స్, మే 27: ప్రతిపక్ష పార్టీల నేతలతోపాటు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, మక్కన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ తదితరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలం టూ బీఆర్ఎస్ నాయకులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, తంగబాలు తదితర నాయకులు బుధవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సీఎం రేవంత్‌రెడ్డి తదితరులపై ఫిర్యాదు చేశారు. ‘ప్రగతిభవన్‌ను నక్సలైట్లు బాంబులు పెట్టి పేల్చేస్తే ఏంది.. అనాడు గడీలు పేల్చిన నక్సలైట్లు ఆ ప్రగతిభవన్‌ను డైనమైట్లు పెట్టి పేల్చినా మాకు నష్టం లేదు.
మాకు సంబంధం లేదు’ అం టూ గతంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన హింసను ప్రేరేపించేలా ఉన్నదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలను ఉద్దేశిస్తూ కూడా అనేక సందర్భాల్లో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. దీంతోపాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సైతం అరవిందో ఫార్మా ఫ్యాక్టరీని తగులబెడ్తానంటూ మీడియా ముఖంగా హెచ్చరికలు చేశారని, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ గతంలో ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకు తాం..అంటూ వ్యాఖ్యానించారని తెలిపారు. ఇలాంటి నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

