సాగునీరివ్వాలని కోరితే బెదిరింపులా?
పంటలకు సాగునీరందించాలని రైతులు కోరితే క్రిమినల్ కేసులు పెడుతామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భయభ్రాంతులకు గురిచేయడం ఏమిటని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. మంథనిలో 5 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తే, భూపాలపల్లిలో ఒక్క మండలాన్ని మాత్రమే ప్రకటించడంపై ఎమ్మెల్యే నోరు మెదపకపోగా, కేసుల పేరుతో రైతులను బెదిరించడం సరికాదని అన్నారు.
- ఇదేనా ఎమ్మెల్యే సత్యనారాయణరావు తీరు
- హామీల అమలులో సర్కార్ విఫలం
- కరువుకు రేవంత్‌రెడ్డిదే బాధ్యత
- మాజీ ఎమ్మెల్యే గండ్ర ధ్వజం
జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): పంటలకు సాగునీరందించాలని రైతులు కోరితే క్రిమినల్ కేసులు పెడుతామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భయభ్రాంతులకు గురిచేయడం ఏమిటని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. మంథనిలో 5 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తే, భూపాలపల్లిలో ఒక్క మండలాన్ని మాత్రమే ప్రకటించడంపై ఎమ్మెల్యే నోరు మెదపకపోగా, కేసుల పేరుతో రైతులను బెదిరించడం సరికాదని అన్నారు.
మంగళవారం ఆయన భూపాలపల్లిలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా రేవంత్‌రెడ్డి తప్పించుకొని తిరుగుతున్నాడని విమర్శించారు. మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్ల విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదని ఆరోపించారు. మూడేండ్లుగా కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
రాష్ట్రంలో కృత్రిమ కరువు పరిస్థితులకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. మేడిగడ్డ బరాజ్‌లో దెబ్బతిన్న రెండు పిల్లర్లకు మరమ్మతు చేయించలేని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు. కరువు మండలాల ప్రకటనలో భూపాలపల్లి నియోజకవర్గానికి అన్యాయం జరిగిందని అన్నారు. గణపురం చెరువును పూర్తిస్థాయిలో నింపి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని, చలివాగు ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించాలని డిమాండ్ చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకం మోటర్లను ఉదయం ప్రారంభించి రాత్రికి నిలిపివేస్తున్నారని, దీంతో రైతులకు సాగునీరు అందడం లేదని పేర్కొన్నారు. మోటర్లను నిరంతరంగా నడిపిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరువు సమస్య ఉండదని సూచించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేడీ పాలన సాగిస్తున్నాడని ధ్వజమెత్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

