హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో తలపెట్టనున్న పెను గర్జనతో సీఎం రేవంత్‌రెడ్డిలో అప్పుడే కలవరం మొదలైందని బీఆర్ఎస్ నేత, గోషామహల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆర్వీ మహేందర్‌కుమార్ విమర్శించారు. ఓ వైపు సొంత సర్వే వెకిరింత ఉకిరిబికిరి చేస్తుంటే, మరోవైపు ఎమ్మెల్యేల వేరుకుంపటి సెగ ఊపిరాడకుండా చేస్తున్నదని ఆదివారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, కమీషన్ల పాలన కొనసాగుతున్నదని విమర్శించారు. సీఎం రేవంత్ వంకర టింకర నిర్ణయాలతో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు.