Manne Krishank | రేవంత్ రెడ్డిపై విచారణ జరిపించండి.. ఈడీకి మన్నె క్రిశాంక్ ఫిర్యాదు
Manne Krishank | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీ శోధ కన్‌స్ట్రక్షన్స్‌పై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
Manne Krishank | న్యూఢిల్లీ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీ శోధ కన్‌స్ట్రక్షన్స్‌పై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం మన్నె క్రిశాంక్ మాట్లాడారు.
కేవలం రూ. 7 లక్షల ఆర్థిక లావాదేవీలు ఉన్న రేవంత్ రెడ్డి బావమరిది శోధ కన్స్ట్రక్షన్స్కు అమృత్ టెండర్లు, సింగరేణి మైనింగ్ కాంట్రాక్టు, డిండి ఇరిగేషన్ కాంట్రాక్టు ఇవ్వడంపై విచారణ చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు క్రిశాంక్ తెలిపారు. గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నపుడు ఏ కంపెనీ పేరుపై ఉన్న కారు వాడాడో ఇప్పుడు అదే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 650 కోట్ల విలువ గల మూడు కాంట్రాక్టులు ఇవ్వడం చట్ట వ్యతిరేకం.. దానిపై కూడా విచారణ జరగాలి. ఇటీవలే ఒక సంచలన కేసులో ఒత్తిడి పెడుతున్నారని తప్పుకున్న జడ్జి విషయంలో కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్, సీఎం రేవంత్ సంబంధంపై విచారణ జరపాలని కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు మన్నె క్రిశాంక్ తెలిపారు. వీటన్నింటికి సంబంధించి ఆధారాలతో సహా ఈడీకి సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

