‘మెడికవర్’ ముఖ్యమంత్రి కుటుంబీకులదే!
‘మెడికవర్ దవాఖాన ముమ్మాటికీ మీ కుటుంబసభ్యులదే. ఒకటి కాదు, మూడు ఆధారాలు చూపుతా. చర్చకు సిద్ధమా రేవంత్‌రెడ్డీ?’ అని కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సవాల్ విసిరారు.
- 3 ఆధారాలు చూపిస్తా.. చర్చకు సిద్ధమా?
- సీఎం రేవంత్‌రెడ్డికి మన్నెక్రిశాంక్ సవాల్
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తేతెలంగాణ): ‘మెడికవర్ దవాఖాన ముమ్మాటికీ మీ కుటుంబసభ్యులదే. ఒకటి కాదు, మూడు ఆధారాలు చూపుతా. చర్చకు సిద్ధమా రేవంత్‌రెడ్డీ?’ అని కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సవాల్ విసిరారు. ఈ మేరకు క్రిశాంక్ శుక్రవారం మీడియాకు ఓ వీడియోను విడుదల చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితులకు చెందిన కంపెనీల షేర్ల వివరాలు వెల్లడించారు.
రేవంత్‌రెడ్డి అక్క అల్లుడి సోదరుడు అన్నం శరత్‌రెడ్డికి మెడికవర్ దవాఖానలో 5,08,808 షేర్లు, గొగులూరి సత్యనారాయణరెడ్డికి (రేవంత్‌రెడ్డి అల్లుడు) చెందిన మ్యాక్స్ బియాన్ ఫార్మాలో 1,08,000 షేర్లు ఉన్నాయని చెప్పారు.

బ్రహ్మానందరెడ్డికి మెడికవర్ దవాఖానలో 28,78,192 షేర్లు, కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్న రేవంత్ కూతురు నైమిషారెడ్డికి చెందిన కంపెనీ మైండ్వాల్ట్లో 65,834 షేర్లు ఉన్నట్టు వెల్లడించారు. దుంప శిరీషారెడ్డికి మెడికవర్‌లో 46,46,596 షేర్లు, మ్యాక్స్ బియాన్ ఫార్మాలో 37 లక్షల షేర్లు, మైండ్వాల్ట్లో 1,97,500 షేర్లు ఉన్నాయని సంచలన విషయాలను బయటపెట్టారు.
శరత్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, దుంప శిరీష.. మెడికవర్ దవాఖాన, మ్యాక్స్బియాన్ ఫార్మా, మైండ్వాల్ట్లో డైరెక్టర్లుగా షేర్లు కలిగి ఉన్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే ఈ మూడింటికీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మెడికవర్ దవాఖానతో మీ అల్లుడు, అమ్మాయికి సంబంధం ఏంది’ అని ప్రశ్నించారు. ఇటీవలి ప్రెస్మీట్లో మెడికవర్ వ్యవహారంపై జర్నలిస్టులు ప్రశ్నలు అడుగగా, ‘పెయిడ్ క్వశ్చన్.. రిబ్బన్ కటింగ్’ అంటూ దాటవేయడంలో ఆంతర్యమేందని ప్రశ్నించారు. మెడికవర్ దవాఖానను ప్రమోట్ చేసి, విక్రయించిన తర్వాత రూ.13,200 కోట్లు వచ్చింది నిజంకాదా? అని నిలదీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

