ఇసుక అక్రమ రవాణాను అరికట్టండి
జగిత్యాల జిల్లా కేంద్రంగా జోరుగా సాగుతున్న ఇసుక, మట్టి అక్రమ రవాణాను అరికట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి బుధవారం లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఇలా.. ‘జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు సాండ్ బజార్‌ను ఏర్పాటుచేశారు. ఇసుక టన్నుకు రూ.1,300 చొప్పున 4 టన్నులకు టాక్స్ కలుపుకొని రూ.6 వేలకు వినియోగదారులకు విక్రయిస్తున్నారు.
- రేవంత్‌కు బీఆర్ఎస్ నేత జీవన్‌రెడ్డి లేఖ
జగిత్యాల, అక్టోబర్ 21: జగిత్యాల జిల్లా కేంద్రంగా జోరుగా సాగుతున్న ఇసుక, మట్టి అక్రమ రవాణాను అరికట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి బుధవారం లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఇలా.. ‘జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు సాండ్ బజార్‌ను ఏర్పాటుచేశారు. ఇసుక టన్నుకు రూ.1,300 చొప్పున 4 టన్నులకు టాక్స్ కలుపుకొని రూ.6 వేలకు వినియోగదారులకు విక్రయిస్తున్నారు. ఇదే ఇసుక గోదావరి నుంచి అనుమతి లేకుండా అక్రమ రవాణాదారులు రూ.4 వేలకే విక్రయిస్తుండటంతో వినియోగదారుడు సాండ్ బజార్ నుంచి కొనడం లేదు. తక్కువ ధరకు పోసే అక్రమ రవాణాదారులను ఆశ్రయిస్తుండటంతో ఆ దందా పెరిగిపోయింది. జిల్లా కేంద్రంలో సాండ్ బజార్ ప్రారంభించి ఏడాది గడుస్తున్నది.
నెలకు 400 టన్నులకే పరిమితం కావడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. సాండ్ బజార్లో ధర ప్రజలకు ఆర్థికంగా భారం కావడం, ఓపెన్ మార్కెట్లో రూ.5 వేల లోపు ధరకే ట్రాక్టర్ ఇసుక లభిస్తుండటంతోనే కొనుగోళ్లు మందగించాయి. ఇదిలావుంటే జగిత్యాల జిల్లా కేంద్రానికి ఇరువైపులా 10 కిలోమీటర్ల మేర వరద కాలువ వెంట మట్టి అందుబాటులో ఉన్నది. నర్సింగాపూర్, మోతె, తిమ్మాపూర్, జాబితాపూర్, హన్మాజీపేట, పోరండ్ల, తాటిపల్లి, మోరపల్లిలో ఎలాంటి టెండర్ లేకుండా అక్రమార్కులు అక్రమంగా మట్టిని తవ్వి విక్రయిస్తున్నారు.
వేలాది వృక్షాలు తొలగిస్తూ, పర్యావరణానికి విఘాతం కలిగిస్తుండగా జిల్లా అధికార యంత్రాంగం, మైనింగ్, రెవెన్యూ శాఖలు పట్టించుకోకపోవడం దురదృష్టకరం. జగిత్యాల పరిసర గ్రామాల ప్రజలు తమ అవసరాల కోసం వరదకాలువ మట్టిని వినియోగించుకునేందుకు అనుమతిస్తే ప్రభుత్వానికి మైనింగ్ సెస్ వస్తుంది. తొలగించిన మట్టి స్థానంలో మనకు వందలాది ఎకరాల భూమి ప్రభుత్వ, ప్రజా అవసరాలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. గనుల శాఖమంత్రి వివేక్ వెంకటస్వామి ఇసుక, మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆలోచిస్తున్న క్రమంలో జగిత్యాలలో సాండ్ బజార్లో టన్ను ఇసుక ధరను రూ.1,300 నుంచి రూ.1,000కి తగ్గించాలి. ఎస్సారెస్పీ వరద కాలువ వెంట ఉన్న మట్టి తవ్వకాలకు అధికారికంగా అనుమతులు ఇవ్వాలి. అప్పుడే అక్రమ రవాణాకు అడ్డుకట్టపడి జిల్లాలో పచ్చదనం వెల్లివిరిసి, పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

