విప్ ఐలయ్యవి దిగజారుడు వ్యాఖ్యలు: ఎర్రోళ్ల
మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఓర్వలేకే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. హరీశ్‌రావు ఆధ్వర్యంలో సిద్దిపేటలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలు విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీలో వణుకు పుడుతున్నదని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వద్ద తన బానిసత్వాన్ని చాటుకునేందుకే ఐలయ్య సృ్పహ కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు.
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఓర్వలేకే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. హరీశ్‌రావు ఆధ్వర్యంలో సిద్దిపేటలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలు విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీలో వణుకు పుడుతున్నదని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వద్ద తన బానిసత్వాన్ని చాటుకునేందుకే ఐలయ్య సృ్పహ కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు.
బీర్ల ఐలయ్య ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్పి తీరుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ మోసాలను తిప్పికొడుతూ సిద్దిపేట నుంచే రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పతనానికి ప్రజలు నాంది పలుకుతారని హెచ్చరించారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి హరీశ్‌రావుకు నీరాజనం పలుకడాన్ని చూసి కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

