హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ సహా ఆ కుటుంబ సభ్యుల వద్ద ఉన్న భూములు, ఆస్తుల మారెట్ విలువపై సమగ్ర విచారణ జరిపించాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ పాటిమీది జగన్మోహన్రావు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 2004లో సోనియాగాంధీ కేవలం రూ.85 లక్షల ఆస్తిని కలిగి ఉన్నట్టు తన ఎన్నికల ఆఫిడవిట్లో పేరొన్నారని, ఆ తర్వాత ఆమె ఆస్తి రూ.13 వేల కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు.
ఢిల్లీలోని అత్యంత ఖరీదైన డెరామండి, సుల్తాన్పూర్ ప్రాంతాల్లో సోనియా, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ పేరిట ఉన్న వందలాది ఎకరాల భూములను కేవలం ప్రభుత్వ విలువతో అఫిడవిట్లలో మేనేజ్ చేశారని ఆరోపించారు. డెరామండి, సుల్తాన్పూర్ భూముల అసలు మారెట్ విలువ ఎన్ని వేల కోట్లు ఉంటుందో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సోనియాగాంధీ ఆస్తుల లెక రూ.13 కోట్లా? లేక రూ. 13 వేల కోట్లా? అన్నది బహిరంగ పర్చాలని, రాబర్ట్ వాద్రా అనతికాలంలోనే వేల కోట్లకు పడగలెత్తి ఈడీ, సీబీఐ విచారణను ఎదురోవాల్సిన పరిస్థితులపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తేతెలంగాణ): సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో వేల కోట్ల విలువైన లోతుకుంట ప్రభుత్వ భూములను కాపాడాలని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు ఒక ప్రకటనలో కోరారు. వెంటనే అత్యున్నత న్యాయనిపుణుల సలహాలతో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. సుమారు 40 ఎకరాల భూమి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను, దాదాపు 219 రోజుల జాప్యం కారణంతో సుప్రీంకోర్టు విచారణకే స్వీకరించకపోవడం రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులపై పునఃపరిశీలన లేదా క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసేందుకు సీనియర్ న్యాయకోవిదులతో సమన్వయం చేసుకుని, లోపాలను సరిదిద్ది పకా ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించారు. కొందరి నిర్లక్ష్యం వల్ల వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తి చేజారిపోకుండా, ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.