మంత్రి కోమటిరెడ్డికి ఆ అర్హత లేదు.. బోయిన్పల్లి వినోద్‌కుమార్ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూరదృష్టి, ముందుచూపుతో రీజినల్ రింగు రోడ్డు (ట్రిఫుల్‌ఆర్) ఆలోచన చేశామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్ నగరానికి వచ్చే పది జాతీయ రహదారులను అనుసంధానించేలా ట్రిఫుల్‌ఆర్ అలైన్మెంట్ రూపొందించామని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూరదృష్టి, ముందుచూపుతో రీజినల్ రింగు రోడ్డు (ట్రిఫుల్‌ఆర్) ఆలోచన చేశామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్ నగరానికి వచ్చే పది జాతీయ రహదారులను అనుసంధానించేలా ట్రిఫుల్‌ఆర్ అలైన్మెంట్ రూపొందించామని పేర్కొన్నారు. ఈ అంశంపై ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణామంత్రి నితిన్ గడ్కరీతో కేసీఆర్, తాను బీఆర్ఎస్ ఎంపీలతో కలిసి అనేక సందర్భాల్లో చర్చించామని, అనుమతులు పొందామని గుర్తుచేశారు.
ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) తరహాలో సుమారు 300 కిలో మీటర్ల మేర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ట్రిఫుల్‌ఆర్ నిర్మిస్తే వేల కోట్ల తెలంగాణ ప్రజల ధనం ఖర్చవుతుందని నాడు కేసీఆర్ భావించారని బోయిన్పల్లి వినోద్‌కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రజల ధనం ఖర్చు కాకుండా, కేంద్ర నిధులతో రోడ్డు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించామని గుర్తుచేశారు. హైదరాబాద్‌కు వచ్చే సుమారు పది జాతీయ రహదారులను అనుసంధానించేలా కేంద్ర ప్రభుత్వ నిధులతో ట్రిఫుల్‌ఆర్ నిర్మించాలని నాడు ముందుచూపుతో కేసీఆర్ ఆలోచన చేశారని తెలిపారు. నాగ్‌పూర్, భూపాలపట్నం, భద్రాచలం, విజయవాడ, బెంగళూరు, బెల్గాం, ముంబై, నాందేడ్, మెదక్-పిట్లం, రాజీవ్ రహదారి.. ఇలా మొత్తం పది ముఖ్యమైన జాతీయ రహదారుల వాహనాలు నగరంలోకి రాకుండానే గమ్యస్థానాలకు వెళ్లేలా హైవేల అనుసంధానంతో ట్రిఫుల్‌ఆర్ నిర్మించాలని నిర్ణయించారని పేర్కొన్నారు.
మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు, హైవేస్ (మోర్త్) అధికారులను ఢిల్లీ నుంచి తీసుకొచ్చి వారితో అనేకసార్లు అలైన్‌మెంట్‌పై నాటి సీఎం కేసీఆర్ చర్చించారని బోయిన్పల్లి వినోద్‌కుమార్ గుర్తుచేశారు. అనేక చర్చల అనంతరం ఉత్తర భాగానికి చెందిన ట్రిఫుల్‌ఆర్ నిర్మాణానికి అనుమతులు లభించాయని తెలిపారు. దక్షిణ భాగానికి సైతం కేసీఆర్ హయాంలోనే ప్రణాళికలు జరిగాయని, ఈలోపు ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రతిపాదనలు ఆగాయని పేర్కొన్నారు. కానీ, కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించడం తగదని హితవుపలికారు. ఆ మాటలు అనే అర్హత కోమటిరెడ్డికి లేదని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు.
ముందున్న ప్రభుత్వాలు తలపెట్టిన పనులు కొనసాగించడం తదుపరి వచ్చే ప్రభుత్వ బాధ్యత అని, పంతాలకు పోకుండా నాటి ట్రిఫుల్‌ఆర్ పనులను కొనసాగిస్తున్నందుకు సంతోషమని బోయిన్పల్లి వినోద్‌కుమార్ తెలిపారు. అదే సందర్భంలో ఉత్తర భాగం పనులకు టెండర్లు పిలువడంతోనే ఆపకుండా త్వరగా పూర్తిచేయడంతోపాటు దక్షిణ భాగం పనులకు సంబంధించిన అనుమతులు కూడా తీసుకురావాలని రేవంత్ సర్కార్‌ను డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

