కంటేశ్వర్, అక్టోబర్ 16 : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. కోటి విరాళం అందజేశారు. ఈ మేరకు గురువారం ఆయన తన సోదరుడు బిగాల మహేశ్తో కలిసి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి వచ్చి కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డికి కోటి రూపాయల విలువ గల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ పాల్గొన్నారు.