KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ముమ్మాటికీ అక్రమం అని పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే కవితను అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూల్చేందుకు బీఎల్ సంతోష్ ప్రయత్నించాడని కేసీఆర్ తెలిపారు. బీఎల్ సంతోష్‌పై కేసు నమోదు చేసి ఆయనకు నోటీసులు పంపామని కేసీఆర్ గుర్తు చేశారు. బీజేపీ కేంద్ర కార్యాలయానికి రాష్ట్ర పోలీసులు వెళ్లారని తెలిపారు. ఈ క్రమంలోనే దుర్మార్గుడైన మోదీ.. బీఆర్ఎస్పై కక్ష కట్టారు. కవితపై ఎలాంటి కేసు లేదు.. కక్ష కట్టి అరెస్టు చేశారు. అందుకే కవితను కుట్రపూరితంగా మనీలాండరింగ్ కేసులో ఇరికించారని కేసీఆర్ స్పష్టం చేశారు.