ఏపీ స్థానిక బరిలో బీఆర్ఎస్ అభ్యర్థి
ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం జిల్లా ఎటపాక మండలం కన్నాయిగూడెం ఎంపీటీసీ స్థానానికి బీఆర్ఎస్ మద్దతుతో ఓ స్వతంత్ర అభ్యర్థి బరిలో నిలిచారు. ఈ మేరకు సదరు అభ్యర్థి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. భద్రాచలం మండలం నుంచి ఏపీలో విలీనమైన వాటిల్లో ఎటపాక గ్రామాన్ని ఏపీ ప్రభుత్వం మండల కేంద్రంగా చేసింది. విలీన మండలాల్లో అత్యధికం తెలంగాణ మూలాలే ఉన్నాయి.
- విలీన పంచాయతీలో నామినేషన్ దాఖలు
భద్రాచలం, అక్టోబర్ 21: ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం జిల్లా ఎటపాక మండలం కన్నాయిగూడెం ఎంపీటీసీ స్థానానికి బీఆర్ఎస్ మద్దతుతో ఓ స్వతంత్ర అభ్యర్థి బరిలో నిలిచారు. ఈ మేరకు సదరు అభ్యర్థి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. భద్రాచలం మండలం నుంచి ఏపీలో విలీనమైన వాటిల్లో ఎటపాక గ్రామాన్ని ఏపీ ప్రభుత్వం మండల కేంద్రంగా చేసింది. విలీన మండలాల్లో అత్యధికం తెలంగాణ మూలాలే ఉన్నాయి.
తాజాగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటంతో ఎటపాక మండలం కన్నాయిగూడెం ఎంపీటీసీ స్థానానికి బీఆర్ఎస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి దారపునేని స్వాతి పోటీ చేసేందుకు సిద్ధమైంది. విలీన పంచాయతీల ప్రజల మద్దతు కూడా బీఆర్ఎస్కు ఉండటంతో ఆ పార్టీ నేతలు ఆమెను బలపరిచారు. దీంతో బీఆర్ఎస్ భద్రాచలం నేత ఆకోజు సునీల్‌కుమార్ సహా మరికొందరు నాయకులు తోడు వెళ్లగా బుధవారం ఆమె స్థానిక కార్యాలయంలో నామినేషన్‌ను దాఖలు చేశారు. బీఆర్ఎస్ బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్థి ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తుండటం అక్కడ రాజకీయంగా ఆసక్తి నెలకొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

