మహబూబాబాద్ : మహబూబాద్ జిల్లాలో(Mahabubabad Dist) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను బోర్ వెల్ లారీ(Borewell lorry )ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన తొర్రూరు పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిని వివరాలు ఇలా ఉన్నాయి. ఫొటో గ్రాఫర్ కూన వరుణ్ (20) అనే యువకుడు బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో తొర్రూరు పట్టణంలోని వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై బైక్ ను బోర్ వెల్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడిది మేడ్చల్ జిల్లా సూరారానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఫ్రెండ్ సూర్యతో కలిసి బైక్ పై హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంటున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.