Shamshabad airport | శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు..
శంషాబాద్ (Shamshabad) అంతర్జాతీయ విమానాశ్రయానికి (Airport) బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో బాంబు పెట్టామని, అది రాత్రి 7 గంటలకు పేలుతుందంటూ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు మెయిల్ (E-Mail) చేశాడు.
హైదరాబాద్: శంషాబాద్ (Shamshabad) అంతర్జాతీయ విమానాశ్రయానికి (Airport) బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో బాంబు పెట్టామని, అది రాత్రి 7 గంటలకు పేలుతుందంటూ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు మెయిల్ (E-Mail) చేశాడు. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్ (CISF), స్థానిక పోలీసులు విమానాశ్రయం మొత్తం తనిఖీలు నిర్వహించారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎలాంటి బాంబు లేదని నిర్ధారించుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అయితే కొద్దిసేపటికే మరో ఐడీతో ఎయిర్పోర్ట్ అధికారులకు మరో మెయిల్ వచ్చింది. తప్పు జరిగిందని, తన కుమారుడు ఫోన్‌తో ఆడుకుంటూ మెయిల్ పెట్టాడని పేర్కొన్నారు. తనను క్షమించాలని కోరాడు. కాగా, ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మెయిల్ చేసిన వ్యక్తి గురించి గాలిస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Bomb Threat
- CISF
- Hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

