హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండి యా చాలెంజ్‌లో బాలీవుడ్ గాయని శ్రేయాగోషల్ పాల్గొన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్ మహదేవన్ విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించిన ఆమె, సోమవారం గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఎంపీ సంతోష్‌కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా శ్రేయాగోషల్ మాట్లాడుతూ ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ గొప్ప కార్యక్రమమని, దీనిలో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే గొప్ప అవకాశం కల్పించిన ఎంపీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆమె మరో ముగ్గురికి ట్విట్టర్ ద్వారా చాలెంజ్ విసిరారు.