Blood Donation | రేవంత్ రక్తదాహానికి రక్తదానం.. సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసన
Blood Donation | బీఆర్ఎస్ నేతల రక్తాన్ని పొలాల్లో చల్లుతానన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్టు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు.
Blood Donation | హైదరాబాద్,జూలై 12 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ నేతల రక్తాన్ని పొలాల్లో చల్లుతానన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్టు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. ‘రేవంత్‌రెడ్డి 3వ పేజీలో
రక్తదాహానికి రక్తదానం’ పేరిట చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని తెలంగాణ భవన్లో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నేతలపై సీఎం ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు.
రైతుల కోసం ప్రాణత్యాగానికైనా తాము సిద్ధమేనని, సీఎం కోరుకున్నట్టుగానే తమ రక్తాన్ని ఇవ్వడానికే ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. వృథాగా దిగువకు వెళ్తున్న గోదావరి జలాలను కన్నెపల్లి పంపుల ద్వారా రిజర్వాయర్లకు తరలించాలని, తెలంగాణ రైతులకు సాగునీరు, హైదరాబాద్ ప్రజలతోపాటు మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు తాగునీటిని అందించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నదని తెలిపారు. రక్తదాన శిబిరంలో పార్టీ, యువజన కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

