Harish Rao | మల్లన్నసాగర్‌కు అతీ సమీపంలో బ్లాస్టింగ్లు.. ప్రమాదంలో రిజర్వాయర్ : మాజీ మంత్రి హరీష్‌రావు ఆందోళన
Harish Rao | హైదరాబాద్ మూసీ నది సుందరీకరణకు నీటి తరలింపు కోసం బండరాళ్ల బ్లాస్టింగ్ ల వల్ల మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రమాదంలో పడుతుందని డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు.
సిద్దిపేట : హైదరాబాద్ మూసీ నది సుందరీకరణకు నీటి తరలింపు కోసం చేపడుతున్న నిర్మాణ పనుల వద్ద బండరాళ్ల బ్లాస్టింగ్ ( Blasting ) ల వల్ల మల్లన్నసాగర్ ( Mallannasagar ) రిజర్వాయర్ ప్రమాదంలో పడుతుందని డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్‌రావు ( Harish Rao ) ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం మల్లన్నసాగర్‌ను బీఆర్ఎస్ నాయకుల తో కలిసి పరిశీలించారు.
నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్నారని ఆరోపించారు. గత రెండు నెలలుగా మల్లన్న సాగర్ రెండు వందల మీటర్ల దూరంలో బ్లాస్టింగ్‌కు సంబంధిత శాఖల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఆరోపించారు. తాను ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారుల వరకు ఫోన్ చేసి అడిగితే సమాచారం లేదంటూ సమాదానం ఇచ్చారని పేర్కొన్నారు. పేలుళ్ల వల్ల ఇళ్లు డ్యామేజ్ అవుతున్నాయని గ్రామ సర్పంచు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా పనులు చేస్తున్నారని ఆరోపించారు.
రాజకీయాల కోసం కుట్రలు
16లక్షల 23 వేల ఎకరాలకు నీరు ఇచ్చే మల్లన్నసాగర్‌ను రాజకీయాల కోసం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే బ్లాస్టింగ్ పనులు ఆపాలని, పేలుళ్ల వల్ల మల్లన్నసాగర్ కట్టకు ఏమైనా నష్టం జరిగిందా అనే విషయాన్ని నిపుణులతో పరిశీలింపజేయాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా పనులు చేపట్టిన అధికారులను సస్పెండ్ చేయాలని , ఏజెన్సీపై యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, పోలీసులు వెంటనే కేసులు నమోదు చేయాలని కోరారు.
తిప్పారం గ్రామంలో దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం చెల్లించి కొత్త ఇళ్లను కట్టించాలని కోరారు. మల్లన్నసాగర్ కోసం భూములిచ్చిన రైతులను బెదిరించి రూ.10 లక్షల పరిహారం మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. అసైన్ రైతులకు ఒకరకంగా, పట్టా రైతులకు మరో రకంగా నష్టపరిహారం ఇవ్వడం ఎంతవరకు కరెక్టని జిల్లా కలెక్టర్‌ను ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | మల్లన్నసాగర్‌కు అతీ సమీపంలో బ్లాస్టింగ్లు.. ప్రమాదంలో రిజర్వాయర్ : మాజీ మంత్రి హరీష్‌రావు ఆందోళన
Bigg Boss | బిగ్ బాస్ హౌస్‌లో ఇన్ని ఇబ్బందులా .. షో వెనుక అసలు విషయాలు బయటపెట్టిన దక్షి!
టేకులపల్లిలో కటారుసుం వేలం
Mailurayi | నాగబాబు చేతుల మీదుగా ‘మైలురాయి’ టైటిల్ లాంచ్.. నిర్మాతగా శ్రీ హన్సిక!
KTR | రాష్ట్రం కరువులో ఉంటది.. కానీ సుందరీకరణ మాత్రం ఆగదు : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

