Raja Singh | బీజేపీ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్
ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ మంగళవారం ప్రకటించింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హైకమాండ్ ఆదేశించింది.
ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది.
పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ మంగళవారం ప్రకటించింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. శాసన సభాపక్ష పదవినుంచి కూడా తొలగించింది. సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హైకమాండ్ ఆదేశించింది.
మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదం రేపాయి. రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహంతో బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను బీజేపీ ప్రశ్నించింది. నగరంలో ప్రముఖ కమెడియన్ మునావర్ ఫారూకి షో సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ వీడియోలో మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఓ వర్గం ఆరోపిస్తున్నది. ఈ మేరకు పలువురు నగర పరిధిలోని పలు స్టేషన్లలో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి నగరంలోనూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమ మనోభావాలను రాజాసింగ్ దెబ్బతీశారని ఆందోళనకారులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
Read More: మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు…బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP
- mla rajasingh
- Prophet
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

