Bandi Sanjay | ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది మాట్లాడొద్దు.. మీడియాకు దూరంగా ఉండాలని ‘బండి’కి జవదేకర్ హెచ్చరిక..!
Bandi Sanjay | ‘ఢిల్లీకి పోయి ఫిర్యాదులు చేయడం ఆపండి.. కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పని చేసుకోనీయండి’ అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పెద్దలు సీరియస్ అయ్యారట. దీంతో ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశం మేరకు కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ తాజాగా బండిని పిలిపించుకుని క్లాస్ పీకినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
- ఢిల్లీకి ఫిర్యాదులు చేయొద్దనడంపై కమలం పార్టీ నేతలు సీరియస్
- హద్దు దాటారంటూ చివాట్లు పెట్టిన బీజేపీ పెద్దలు
Bandi Sanjay | హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): ‘ఢిల్లీకి పోయి ఫిర్యాదులు చేయడం ఆపండి.. కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పని చేసుకోనీయండి’ అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పెద్దలు సీరియస్ అయ్యారట. దీంతో ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశం మేరకు కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ తాజాగా బండిని పిలిపించుకుని క్లాస్ పీకినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఇలా బహిరంగ వేదికపై నోరు జారడం ఏమిటని ప్రశ్నించినట్టు సమాచారం. రాష్ట్ర పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ ఉన్న వేదికపై అలా మాట్లాడటం హద్దు మీరినట్టేనని బండికి స్పష్టం చేశారట. బీజేపీలో ఎంతో క్రమశిక్షణ కలిగిన నేతనని చెప్పుకుంటూ ఇలా మాట్లాడటం వెనుక అంతర్యం ఏమిటని నిలదీశారట.
పదవిలో ఎవరు ఉండాలో, ఎవరు ఉండొద్దో నిర్ణయించేది అధిష్ఠానమైతే రాష్ట్ర నేతలకు ఎందుకు ముడిపెడుతున్నావని బండిని ప్రశ్నించినట్టు సమాచారం. దీనిపై బండి అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తనను ఏ కారణంగా తప్పించారో అధిష్ఠానం ఎందుకు చెప్పడం లేదని ఆయన అడిగినట్టు సమాచారం. పార్టీకి చేసిన సేవలకు కనీసం జాతీయ స్థాయిలో మంచి పదవి వస్తుందని ఆశిస్తే.. తూతూమంత్రంగా ఓ పదవి ముఖాన పడేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. దీంతో కొన్నాళ్లపాటు మీడియాకు దూరంగా ఉండాలని, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది మాట్లాడొద్దని బండికి జవదేకర్ స్పష్టం చేసినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

